దుబాయ్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి


 నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకున్న సంఘటన దుబాయ్‌లో జరిగింది. బుర్జ్‌ ఖలీఫాకు సమీపంలోని ఓ హోటల్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. హోటల్‌లోని 20 అంతస్థలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం కూడా రంగంలోకి దిగింది. వేడుల్లో పాల్గనేందుకు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.


Post a Comment

0 Comments