డ్రాతో ముగించిన కేరళ

       
             ఖచ్చితంగా గెలిచే తమ చివరి మ్యాచ్‌ను కేరళ బ్లాస్టర్స్‌ డ్రాగా ముగించింది. గురువారం ఢిల్లీ డైనమోస్‌, కేరళ బ్లాస్టర్స్‌ మ్యాచ్‌ 3-3తో డ్రా అయింది. తొలి అర్ధభాగంలోనే ఐదు గోల్స్‌ నమోదయ్యాయి. ఢిల్లీ ఆటగాడు డాన్‌ సాంటోస్‌ 7వ నిమిషంలో తొలి గోల్‌ చేయగా, నబి 40వ నిమిషంలో మరో గోల్‌ కొట్టాడు. కేరళ ఆటగాళ్లు దగ్‌నల్‌ 9వ నిమిషంలో, కొయింబ్రా 30వ నిమిషంలో, జెర్మన్‌ 39వ నిమిషంలో గోల్స్‌ కొట్టారు. దీంతో కేరళ 3- 2 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగం చివరి నిమిషంలో ఢిల్లీ ఆటగాడు సెహనాజ్‌ గోల్‌ చేయడంతో మ్యాచ్‌ 3- 3తో డ్రా అయింది. ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి తప్పుకున్న కేరళ ఈ మ్యాచ్‌తో 3 విజయాలు, 7 పరాజయాలు, 4 డ్రాలతో ఈ సీజన్‌ను ముగించింది.
          మరోవైపు సెమీస్‌కి చేరిన ఢిల్లీ డైనమోస్‌ 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఢిల్లీకి మరో మ్యాచ్‌ మిగిలి ఉండడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. Post a Comment

0 Comments