రెండో బిడ్డకు జన్మనివ్వనున్న చెల్సియా క్లింటన్‌


అమెరికా  మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ కుమార్తె చెల్సియా క్లింటన్‌కు  రెండో సంతానం కలగనుంది. ఈ విషయాన్ని చెల్సియా తన ట్విట్టర్‌లో తెలిపారు. తన ఏడాది వయసున్న కూతురు చార్లెట్‌.... అక్క కాబోతోందని చెల్సియా ఈ సందర్భంగా తెలిపింది. చెల్సియా తల్లి హిల్లరీ క్లింటన్‌ డెమోక్రటిక్‌ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుగా నిలిచిన నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యత సంచరించుకుంది. 2010లో చెల్సియాకు బ్యాంకర్‌ అయిన మార్క్‌ మెజ్విన్‌స్కీకితో వివాహం అయ్యింది.


Post a Comment

0 Comments