ఆస్కార్‌ పిస్టోరియస్‌కి బెయిల్‌


          ప్రియురాలి హత్య కేసులో దోషిగా తేలిన ప్రముఖ పారా ఒలింపియన్‌ ఆస్కార్‌ పిస్టోరియస్‌కు మంగళవారం న్యాయస్థాన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టి ఆస్కార్‌ ఉద్దేశపూర్వకంగానే తన ప్రియురాలిని హత్య చేశాడని అక్కడి సుప్రీంకోర్టు గత గురువారం తేల్చింది. అనంతరం ఆయన బెయిల్‌ కోసం  దరఖాస్తు చేసుకోగా తగిన పూచికత్తులతో  న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. సుప్రీంతీర్పుపై ఆస్కార్‌ అప్పీల్‌కు వెళ్లనున్నట్లు అతని న్యాయవాది పేర్కొన్నారు.
           2013 ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున  ఆస్కార్‌ తన ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను తన ఇంట్లో దారుణంగా కాల్చి చంపాడు. అయితే దొంగ అనుకుని కాల్పలు జరిపానని, అ్కడున్నది రీవా అని తనకు తెలియదని ఆస్కార్‌  చెప్పారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక న్యాయస్థానం గత ఏడాది అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సంవత్సర కాలం జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఆస్కార్‌ అక్టోబర్‌లో పెరోల్‌ మీద  విడుదలయ్యాడు. అయితే స్థానిక కోర్టు తీర్పుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తిరిగి విచారణ జరిపిన సుప్రీంకోర్టు అతనిని దోషిగా తేల్చింది.

Post a Comment

0 Comments