విమానంలో ఎలుక...


 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఎలుక కనిపించిందని ప్రయాణికులు పేర్కొన్నారు. దీంతో ప్రయాణీకులు విమాన సిబ్బందిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులు ఆరోపణల నేపథ్యంలో ముంబైలో అత్యవసరంగా ఫైలట్‌ విమానాన్ని దింపేశాడు. ఎయిర్‌ ఇండియా మాత్రం విమానంలో  ఎలుక కనిపించిందనే విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదని స్పష్టం చేసింది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విమానాన్ని అత్యవసరంగా దింపినట్లు  తెలిపింది. ముంబయి విమానాశ్రయంలో ఆరుగంటల ఆలస్యం తరువాత మరో విమానంలో ప్రయాణికులను పంపించారు. ఈ ఘటనపై ఎయిర్‌ ఇండియా దర్యాప్తు చేపడుతోంది.


Post a Comment

0 Comments