ఐపీఎల్‌ కొత్త జట్లలస్తున్నాయ్‌!

           
             ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వచ్చే రెండేండ్లకు నూతనంగా రెండు జట్లు రానున్నాయి. రెండేండ్ల నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాంఛైజీల స్థానంలో 2016, 2017 సీజన్‌లలో ఈ రెండు జట్లు పాల్గంటాయి. డిసెంబర్‌ 8న సమావేశం కానున్న ఐపీఎల్‌ పాలకమండలి భేటీ అనంతరం రెండు కొత్త జట్లపై ప్రకటన చేయనుంది. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌, కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌, రాజీవ్‌ శుక్లా సమావేశంలో పాల్గననున్నారు. చెన్నైకి చెందిన చెట్టనాడ్‌ సంస్థ ఓ జట్టును సొంతం చేసుకోనుందని సమాచారం. సూపర్‌ కింగ్స్‌ ఇండియా సిమెంట్‌ యాజమాన్యానిది కాగా.. చెట్టినాడ్‌ గ్రూప్‌కు సైతం సిమెంట్‌ వ్యాపారం ఉన్న విషయం తెలిసిందే. గోయంకా బ్రదర్స్‌.. హర్ష్‌, సంజీవ్‌లు సైతం ఐపీఎల్‌ జట్టుపై ఆసక్తిగా ఉన్నారు. మొబైల్స్‌ కంపెనీ వీడియోకాన్‌ కూడా బీసీసీఐ నుంచి ఇన్విటేషన్‌ టూ టెండర్‌ ఫామ్‌ను తీసుకున్నట్టు సమాచారం. మంగళవారం ఐపీఎల్‌ పాలకమండలి భేటీ తర్వాత జరిగే మీడియా సమావేశంలో బోర్డు పెద్దలతో పాటు కొత్తగా చేరిన రెండు జట్ల యజమానులూ పాల్గననున్నారు.

Post a Comment

0 Comments