ఒకే రోజు 47 మందికి ఉరి


ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేదే లేదని, వారిని కఠినంగా శిక్షించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించింది. ఏకంగా ఒకేసారి 47 మందికి ఉరిశిక్ష అమలు చేశారు. ప్రఖ్యాత షియా క్లరిక్‌ షేక్‌ నిమల్‌ అల్‌ నిమ్ర్‌ కూడా ఇందులో ఉన్నారు. 2003 నుంచి 2006 వరకు వివిధ ప్రదేశాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని ఈ రోజు ఉరితీశారు. ఇదిలా ఉంటే షియా క్లరిక్‌ షేక్‌ నిమల్‌ అల్‌ నిమ్ర్‌ విషయంలో ఇరాన్‌ జోక్యం కలగజేసుకుంది. అతడికి శిక్ష అమలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నిమ్ర్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబర్‌లో తిరస్కరించింది.


Post a Comment

0 Comments