90ఏండ్ల వృద్ధురాలి కోసం...  • వరండాలో తీర్పు చెప్పిన న్యాయమూర్తి

కోర్టుల్లోనే న్యాయమూర్తులు తీర్పులు చెబుతుండటం చూస్తుంటాం. కానీ ఓ న్యాయమూర్తి తాను ఆశీనులవ్వాల్సిన చోట కాకుండా ఏకంగా వరండాలోకొచ్చి తీర్పు చెప్పటానికి సిద్ధమయ్యారు. హోషంగాబాద్‌లో 90 ఏండ్ల  వృద్ధురాలు కోర్టు మెట్లు ఎక్కలేకపోయింది. జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ మయంక్‌ శుక్లా అరగంట సేపు తన అదాలత్‌ను వరండాలో నిర్వహించారు. హోషంగాబాద్‌ నివాసి అయిన తొంభై ఏండ్లు దాటిన కాశీబాయి దొంగతనం కేసులో తన వాంగ్ములాన్ని వినిపించటానికి కోర్టుకు వచ్చింది. ఈ కేసు గత 20 ఏండ్ల నుంచీ నడుస్తున్నది. దీంతో కోర్టు చుట్టూ ప్రదక్షిణాలు తప్పటంలేదు. న్యాయస్థానంలో ఉండే బోనులో నిలబడి తన వాదనను వినిపించలేనంతగా వృద్ధాప్యం ఆమెను ఆవహించింది. ఈ విషయాన్ని గుర్తించిన న్యాయమూర్తి మయంక్‌ శుక్లా మానవతా ధృక్పథంతో ముందడుగు వేశారు. కోర్టు వరండాలోనే ఆశీసునులై, ఆమెను తన ఎదుట కూర్చొబెట్టుకొని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాశీబాయి తాను పడుతున్న వ్యథను ఆయన ముందుంచింది. చివరగా మళ్లీ కోర్టుకు రావాల్సిన అవసరంలేదు కదా (సాహెబ్‌ అబ్‌ తో నహీ అనా పడేగా కోర్ట్‌) అన్నది. ఇకపై వాదన వినిపించటానికి కోర్టుకు రావాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి శుక్లా అనటంతో ఆ వృద్ధురాలి కండ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి.


Post a Comment

0 Comments