ప్రియుడ్ని కలవటానికి ఆటోలో వెళ్తుంటే...

 ఓ యువతి ఆటోలో వెళ్తుండగా..దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఈ దారుణం సోమవారం జక్కాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జరగటం గమనార్హం. చనిపోయిన యువతి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. ఈహత్య చేసింది ఆమె ప్రియుడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండోర్‌ వాసి సృష్టి జైన్‌ ఇటీవల పాట్నాకు వచ్చింది. ఆమె ఓ హోటల్‌లో ఉంటోంది.అదో హోటల్‌ ఆమె ప్రియుడు కూడా బసచేశాడు. అయితే తనకు  లక్ష రూపాయలు ఇవ్వాలని సృష్టి ప్రియుడు రజనీష్‌ వేధించటం మొదలుపెట్టాడు.  వారిద్దరి మధ్య చాలా సేపు హోటల్‌లో గొడవ జరిగిందని సమాచారం.
అతనితో తెగదెంపులు చేసుకోవాలని ఆమె నిర్ణయించింది. తిరిగివెళ్లటానికి  ఆటోలో రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది. రజనీష్‌ తన మిత్రులతో కలిసి బైక్‌లపై ఆమెను వెంటాడారు. ఆ తర్వాత ఆమెపై తన వద్ద ఉన్న రివాల్వర్‌తో  కాల్పులు జరిపాడు.సృష్టి తేరుకునేలోపు చనిపోయింది. ఆటోలో ఉన్న సృష్టికి నాలుగు బుల్లెట్లు తగిలినట్టు పోలీసులు ప్రాథమిక ంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల బెంగళూరులో కూడా ఫేస్‌బుక్‌లో టెకీకి పరిచయమైన ఓ యువకుడు డబ్బుల కోసం వేధించాడు. అలా ఇవ్వని యువతిని ప్రాణాలు తీసిన ఘటన విదితమే.ఈ దారుణం జరిగిన రోజుల వ్యవధిలోనే బీహార్‌లోనూ అలాంటి ఘోరం జరిగింది. సో..బాయ్‌ఫ్రెండ్‌తో జాగ్రత్తగా ఉండండి.


Post a Comment

0 Comments