బాలికపై లైంగికదాడి
  • అవమాన భారంతో ఆత్మహత్య

 నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన కుమార్తె క్రిష్ణవేణి (17)తో కలిసి నర్సక్కపల్లె గ్రామంలో ఓ గదిలో అద్దెకుంటున్నాడు. వడ్డెర కులానికి చెందిన వెంకటేశ్వర్లు బావుల తవ్వకం పనులు చేస్తూ కూతురుతో జీవిస్తున్నాడు. వెంకటేశ్వర్లు ఇంట్లో లేని సమయం చూసి బుధవారం సాయంత్రం గ్రామానికి చెందిన నలుగురు యువకులు బాలిక వద్దకు వెళ్లి లైంగికదాడికి యత్నించారు. ఆ అవమానం భరించలేక ఇంట్లో ూన్న డీజిల్‌ పోసుకొని నిప్పంటించుకుంది. బాలిక అనుమానస్పద మృతిపై వివరాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులను ప్రయత్నించగా రాత్రి 9 గంటల వరకు ఎవరూ అందుబాటులోకి రాలేదని తెలుస్తున్నది. అర్థరాత్రి డిఎస్పీ సంజీవరావును వివరణ కోర గా బాలిక మృతిపై విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వర లోనే వెల్లడిస్తామని తెలిపారు.


Post a Comment

0 Comments