అరిచినా వదల్లేదు...  • లైంగిక దాడిపై ఇన్‌స్టాగ్రాంలో మహిళ వెల్లడి

ఫెమినిస్ట్‌ ప్రచారకర్తపై దారుణం జరిగింది. షవర్‌ కింద ఉండగా ఓవ్యక్తి ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని లైంగికదాడికి గురైన మహిళ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది.. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. న్యూయార్క్‌కు చెందిన 27 ఏళ్ల అంబర్‌ అమోర్‌ ఫెమినిస్ట్‌ దక్షిణాఫ్రికాలోని యూత్‌ హాస్టల్‌లో నివసిస్తుంది. రెండ్రోజులుగా అలిసిపోయిన ఆమె ఓ వ్యక్తితో హాట్‌ షవర్‌ చేసేందుకు అంగీకరించింది. దీంతో వారిద్దరు బాత్‌రూంలో ఉన్నారు. అయితే ఆ వ్యక్తి బలవంతంగా ఆమె మోకాళపై కూర్చోవడంతో అమోర్‌ గట్టిగా కేకలు వేసింది. అయినప్పటికీ అతను తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని, అప్పుడు బిగ్గరగా ఏడ్చానని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది. కొన్ని నిమిషాల తర్వాత అతను తనను వదిలేసి వెళ్లిపోయాడని పేర్కొంది. బాత్‌రూం దగ్గరకు వెళ్తే పోలీసులకు ఈ విషయం అర్థమవుతుందని ఆమె తెలిపింది. చాలా మంది మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని, కానీ వారంతా బయటకు చెప్పుకోలేక కుండిపోతున్నారని అమోర్‌ పేర్కొంది. ధైర్యంగా విషయాన్ని చెప్పుకుని అత్యాచారం చేసిన నిందితులకు శిక్షపడే వరకు పోరాడాలని ఆమె బాధితులకు అమోర్‌ సూచించింది.


Post a Comment

0 Comments