కామాంధుడు ఆ బాలికపై....  • ఖమ్మం జిల్లాలో ఘటన

బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రేలకాయలపల్లి పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ బాలిక ఇల్లందులో ఎస్టీ బాలికల వసతి గృహంలో ఉంటూ పదో తరగతి చదువుతోంది. సోమవారం బాలికకు ఆరోగ్యం బాగలేకపోవడంతో

ప్రధానోపాధ్యాయురాలు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం బాలిక ప్రధానోపాధ్యాయురాలు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం బాలిక ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని ఇంటికి బయలుదేరింది. పక్కగ్రామైన జయత్రాం తండాకు చెందిన రాంజీ అనే వ్యక్తి తాను అటువైపే వెళ్తున్నానని చెప్పి బాలికను  ద్విచక్రం వాహనంపై ఎక్కించుకుని కొంతదూరం వెళ్లాడు. మార్గమధ్యలో వాహనాన్ని ఆపి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక భయంతో పారిపోయి వేరే వాహనంలో ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

0 Comments