లైంగిక దాడులకు పాల్పడే వారిని గెంటేస్తాం..!  • జర్మనీ ఛాన్స్‌లర్‌ మెర్కెల్‌ హెచ్చరిక

 కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో లైంగిక దాడులకు పాల్పడిన శరణార్ధులను దేశం నుండి గెంటేస్తామని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ తీవ్రంగా హెచ్చరించారు.  ఈ వేడుకల్లో తమపై లైంగిక దాడికి ప్రయత్నించారంటూ దాదాపు 120 మందికి పైగా మహిళలు కొలోన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు వివరించారు.  ఇందులో రెండు అత్యాచారం కేసులు కూడా వున్నాయన్నారు.  హాంబర్గ్‌, స్టట్‌గార్ట్‌ వంటి నగరాల్లో కూడా ఇదేవిధమైన ఫిర్యాదులతో కేసులు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు.  ఈ దాడులకు పాల్పడిన  వారంతా అరబ్‌ లేదా ఉత్తరాఫ్రికా సంతతికి చెందిన వారేనని సాక్షులు చెప్పినట్లు పోలీసులు వివరించారు. కొంతమంది అనుమానితులను ఇప్పటికే గుర్తించామన్నారు. నేరాలకు పాల్పడినట్లు రుజువైన వారిని కచ్చితంగా దేశం నుండి పంపివేస్తామని జర్మనీ న్యాయశాఖ మంత్రి హీకో మాస్‌ ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  శరణార్ధులుగా వచ్చిన వ్యక్తులు ఏడాది అంతకు మించిన కాలం జైలు శిక్షకుగురై వారి కేసు పెండింగ్‌లో వుంటే వారిని వెంటనే స్వదేశాలకు పంపేయాలని జర్మనీ చట్టాలు చెబుతున్నాయి. 


Post a Comment

0 Comments