కోరిక తీర్చిన కేటీఆర్‌


 ప్రాణాపాయ స్థితిలో ఉండి తనను చూడాలని కోరుకున్న ఓ యువకుడి కోరికను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నెరవేర్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సంతోష్‌ అనే యువకుడు ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్నాడు. ఇటీవల పెద్దపేగు సమస్యతో నిమ్స్‌ ఆస్పత్రిలో చేరాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువకుడు కేటీఆర్‌ను చూడాలనుకుంటున్నాడని సామాజిక మాధ్యమాల్లో విస్త అత ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న కేటీఆర్‌ శుక్రవారం నిమ్స్‌కు వచ్చి ఆ యువకుడిని పరామర్శించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కోలుకున్న తర్వాత అతడి చదువుకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు.


Post a Comment

0 Comments