వాలైంటెన్స్‌ డే పార్టీకి పిలిస్తే..కాటేశాడువాలైంటెన్స్‌ డే పార్టీకి పిలిచిన ఎంబీఏ విద్యార్థిని కాటేశాడో ఓ కామాంధుడు. ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకోవాలనుకుంది ఆ యువతి.స్నేహితులను పిలిచింది. రాత్రంతా బాగా చిందులేశారు.డిన్నర్‌ అయ్యాక వచ్చిన అతిధులంతా వెళ్లిపోయారు. ఇద్దరు స్నేహితులు మాత్రం బాగా లేటయ్యింది.ఇక్కడే పడుకుంటామంటే సరేనని ఒప్పుకుంది.వారికి ఓ గదిని చూపించి..తన గదికి వెళ్లి నిద్రపోయింది.ఇదే అదనుగా భావించి ఓ స్నేహితుడే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.వైద్యరిపోర్టులోనూ ఆమెపై అఘాయిత్యం జరిగిందని నిర్ధారయ్యింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రేమికురాలిని కలవటానికి పోతే.. చంపేశారు
వాలైంటెన్స్‌ డే రోజున మరో ఘటన చోటుచేసుకుంది. తన ప్రియురాలిని కలవటానికి ఇంటికి వెళ్లిన ప్రియుడ్ని బంధువులు ఇంటిపై నుంచి తోసేయటంతో అతను దుర్మరణం పాలయ్యాడు.న్యూఢిల్లీ గుడ్‌గావ్‌ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.జహంగీర్‌పూర్‌ ప్రాతానికి చెదిన ఈశ్వర్‌  ప్రియురాలు సుశాంత్‌ లోక్‌ ప్రాంతంలో ఉంటుంది.సంపన్న వర్గాలుండే ఆ భవంతిలోకి వెళ్లిన ఈశ్వర్‌ని పట్టుకుని ప్రియురాలు బంధువులు కొట్టారు. అమాంతంగా అతనిని నాలుగో అంతస్థునుంచి కిందకు పడేశారు.ఏడునెలలకింద ఫేస్‌బుక్‌లో వారిద్దరూ పరిచమయ్యారని పోలీసులు తెలిపారు. కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Post a Comment

0 Comments