మహేష్‌బాబు, కొరటాల శివకు సమన్లు

              శ్రీమంతుడు సినిమా కథపై వివాదంలో నటుడు మహేష్‌ బాబు, దర్శక నిర్మాతలు కొరటాల శివ, ఎర్నేని నవీన్‌ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. శ్రీమంతుడు సినిమా కథ తనదేనంటూ రచయిత శరత్‌ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఓ వార పత్రికలో 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను అనుమతి లేకుండా సినిమా తీసి కాపీ రైట్‌ చట్టాన్ని ఉల్లంఘించారని.. వారిపై క్రిమినల్‌ చర్యలను తీసుకోవాలని కోర్టును కోరారు. శరత్‌ చంద్ర ప్రైవేట్‌ ఫిర్యాదును ఇవాళ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణకు హాజరు కావాలని మహేష్‌ బాబు, కొరటాల శివ, నవీన్‌ లను ఆదేశించింది. ముగ్గురిపై ఐపీసీ 120బీ, కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63 కింద నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది. 

Post a Comment

0 Comments