300 ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల మూసివేత ?

300 ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల మూసివేత ?

       న్యూఢిల్లీ : వచ్చే విద్యా సంవత్సరంలో అంటే 2018-19లో దేశవ్యాప్తంగా ప్రయివేటు రంగంలోని 300 ఇంజినీరింగ్‌ విద్యా సంస్థలు మూతబడనున్నాయి. గడచిన అయిదేండ్ల కాలంలో ఈ సంస్థల్లో ప్రవేశాలు 30 శాతం కంటే తక్కువగా ఉoడడమే అందుకు కారణం. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి సమాచారం ప్రకారం మరో 500 ఇంజినీరింగ్‌ కాలేజీల భవితవ్యం ప్రస్తుతం పరిశీలనలో ూంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఆ మేరకు ఆదేశాలు వెళ్లాయి. ప్రత్యామ్నాయంగా వాటిని సైన్స్‌ కాలేజీలుగా కానీ, వృత్తివిద్యా సంస్థలుగా కానీ మార్చుకోవాలని సూచిస్తోంది. దేశంలో మొత్తం 3000 సంస్థల్లో 13.56 లక్షల మందికి అండర్‌ డిగ్రీ కోర్సులు అందజేస్తున్నాయి. వాటిలో 800 కాలేజీల్లో ప్రవేశాల శాతం 50 కన్నా తక్కువగానే ూంటోంది. అయితే మూసివేత అనేది తక్షణ పరిష్కారంగా కనిపించినా.. ఆయా యాజమాన్యాలకు ఇది చాలా పెద్ద సమస్య అని, ఇతరత్రా సమస్యను పరిష్కరించేందుకు కృషి జరుగుతోందని ఏఐసీటీఈ చైర్మెన్‌ సహస్రబుద్ధి తెలిపారు.

డీమ్డ్‌ వర్సిటీ హోదాపై సుప్రీం కోర్టు నుంచి అభ్యంతరం  

డీమ్డ్‌ వర్సిటీలుగా కొన్ని విద్యా సంస్థలు ప్రచారం చేసుకోవడంపై మరోసారి సుప్రీం కోర్టు అభ్యంతరం తెలిపింది. ఇదే విషయం ప్రకటిస్తూ గత నవంబర్‌ 3వ తేదీన ఆ రకంగా డీమ్డ్‌ వర్సిటీ అని తమ సంస్థల పేర్లకు జతచేసుకోవడం యూజీసీ చట్టం ూల్లంఘించడమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనిని సవాలు చేస్తూ కొన్ని సంస్థ యాజమాన్యాలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. తాజా ఆదేశాలలో కూడా - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. అలా ఏర్పాటు చేసిన వాటిలో కొన్నిటికి యూజీసి గుర్తింపునిస్తోంది. 

Post a Comment

0 Comments