సినీన‌టుడు విజయ్‌ భార్యపై కేసు నమోదు

 సినీ హాస్యనటుడు విజయ్‌ సాయి  ఆత్మహత్య కేసులో అతడి భార్య వనితపై కేసు నమోదైంది. విజయ్‌ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వనితతో పాటు న్యాయవాది శ్రీనివాస్‌, శశిధర్‌లపైనా జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న ఆయన భార్య వనితతో పాటు మరో ఇద్దరిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వేధింపులకు గురిచేయడం వల్లే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్య
చేసుకొనే ముందు విజయ్‌ సాయి ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారు? ఎవరినైనా కలిశారా? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మంగళవారం పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు.

Post a Comment

0 Comments