విజ‌య్ అంత్యక్రియ‌లు పూర్తి

ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ సినీన‌టుడు, క‌మెడియ‌న్ విజ‌య్ అంత్య‌క్రియ‌లు ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ముగిశాయి.  యూసుఫ్‌గూడలోని  ఇంటి నుంచి విజయ్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆయనకు దహన సంస్కారాలు నిర్వహించారు.  భార్య‌తో మ‌న‌స్ప‌ర్దాలు రావడంతో  సోమవారం ఉదయం విజ‌య్ ఆత్మహత్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం విజయ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  పోస్టుమార్టం పూర్తి కాగానే  యూసుఫ్‌గూడలోని స్వగృహానికి మృత‌దేహాన్ని తరలించారు. 

Post a Comment

0 Comments