బాబుపై కేటీఆర్ ప్ర‌శంస‌లు


  • ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబే..
  • ఐటీ హ‌బ్‌గా న‌గ‌రాన్ని నిలుప‌డంలో బాబు కృషి అమోఘం ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఐటీ రంగానికి చేసిన కృషిని కేటీఆర్ ఒప్పుకోక‌త‌ప్ప‌లేదు... ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. హైటెక్స్‌ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్‌ మూర్తి, నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ డేబ్జానీ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో
చంద్రబాబు కృషి చేశారన్నారు. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో తమ కృషి ఏమీ లేదని పేర్కొన్నారు. ఆ క్రెడిట్‌ అంతా చంద్రబాబుకే దక్కుతుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ నగర అభివృద్ధి ప్రణాళికలు, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనపై వివరించారు.  17ఏళ్లలో మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వ‌చ్చాయన్నారు. భవిష్యత్ లో అమరావతి బాగా అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments