వైభ‌వంగా తెలుగు మహాసభలు షురూ


        ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లాల్‌బ‌హుదూర్ స్టేడియంలోఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. మ‌హాస‌భ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజ‌రై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, ఈటల, కేటీఆర్‌, తుమ్మల, జగదీశ్‌రెడ్డి, పోచారం , మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు

నందిని సిధారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కవులు, కళాకారులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారుల పేరిణి నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా ఉద్యమించి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సాహితీ ప్రియుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన భాషా మ‌హోత్స‌వ‌మిది అని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. 

Post a Comment

0 Comments