మందకృష్ణ అరెస్ట్..

 ఎమ్మార్పీఎస్ మెరుపు ఆందోళ‌న‌లు .......

 హైద‌రాబాద్‌లో ఆదివారం అర్థ‌రాత్రి  ఆందోళనలు చేపట్టిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు  ఎక్కడికక్కడ  అరెస్ట్ చేస్తున్నారు. నగరంలోని రాంగోపాల్‌పేట పీఎస్‌ దగ్గర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. రాంగోపాల్‌పేటలో అరెస్ట్ చేసిన మందకృష్ణ
మాదిగను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. మందకృష్ణతో పాటు మరికొందర్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఆందోళనలో ఐదుగురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. అప్రమత్తమైన మహిళా పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. రాంగోపాల్‌పేట నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు అడుగడుగునా ముళ్లకంచెలు, బారీకేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని పీఎస్‌‌లకు సమాచారం అందించి అలర్ట్‌గా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.

Post a Comment

0 Comments