భాజపా విజ‌య‌కేత‌నం

 దేశం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది. గుజరాత్‌ 182 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార భాజపాకు 99 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు 80 స్థానాలు, ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపాలైంది. 68 స్థానాలకు గాను 44 స్థానాల్లో భాజపా విజయం సాధించి విజయ దుందుభిమోగించింది. కాంగ్రెస్‌ 21 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.

Post a Comment

0 Comments