పనిష్‌మెంట్‌ పేరుతో విద్యార్థినుల బట్టలిప్పారు

పనిష్‌మెంట్‌ పేరుతో విద్యార్థినుల బట్టలిప్పారు

అరుణాచల్‌లో దారుణం

    అరుణాచల్‌ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. పనిష్మెంట్‌ పేరిట తోటి విద్యార్థినుల ముందు 88మంది బాలికలతో బల వంతంగా దుస్తులు విప్పించారు ముగ్గురు ఉపా ధ్యాయులు. ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా ఓ కాగితంలో అసభ్య వ్యాఖ్యలు రాశారని ఆరోపిస్తూ.. టీచర్లు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. పాపుమ్‌ పారే జిల్లా తాని హప్పలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల 23న ఈ దారుణం చోటుచేసుకుంది. ఆరో, ఏడో తరగతికి చెందిన 88మంది బాలికలను ఇలా అవమానించారు. ఈ నెల 27న బాధిత విద్యార్థి నులు విద్యార్థి సంఘాన్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఓ విద్యార్థిని, ప్రధానోపాధ్యాయుడి పట్ల అసభ్య వ్యాఖ్యలు రాసి ఉన్న కాగితం దొరకడంతో ఇద్దరు అసిస్టెంట్‌ టీచర్లు, ఒక జూనియర్‌ టీచర్‌ ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అరుణచాల్‌ప్రదేశ్‌లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Post a Comment

0 Comments