హైకోర్టు అనుమతిచ్చినా....

హైకోర్టు అనుమతిచ్చినా.... సభకు రానీయడంలేదు 

- ఐకాస ఛైర్మన్‌ కోదండరాం 

 తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన ‘కొలువులకై కొట్లాట’ సభ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ సభకు రానీయకుండా పోలీసులు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. న్యాయస్థానం అనుమతించినప్పటికీ సభకు ఎవరినీ రానీయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఇప్పటివరకు సుమారు 2వేలమందిని పోలీసులు అరెస్టుచేశారన్నారు. నిరుద్యోగ సమస్యకు కచ్చితమైన పరిష్కారం లభించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ అనేక మంది పద్మవ్యూహాన్ని ఛేదించి ఇక్కడకు చేరుకున్నారన్నారు. నిరుద్యోగ సమస్య కోసమే యువకులంతా ఇక్కడికి వచ్చారన్నారు. అంతా సంఘటితంగా పోరాడేందుకే ఈ వేదిక ఏర్పాటుచేసినట్టు కోదండరాం చెప్పారు. ఈ సభను అంతా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.  

Post a Comment

1 Comments