తెలుగు మహాసభలకు మంత్రివర్గ ఉపసంఘం

తెలుగు మహాసభలకు మంత్రివర్గ ఉపసంఘం 

 ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఈ ఏర్పాటుచేసిన ఈ సబ్‌ కమిటీలో మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్‌ సభ్యులుగా ఉంటారు. సాహిత్య అకాడమీ, ఇతర సంస్థల సమన్వయంతో ఈ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించనుంది.
స్వయంగా ఏర్పాట్లు పరిశీలించిన తెలంగాణ‌ సీఎం తెలుగు మహాసభల నిర్వహణపై
ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నేరుగా ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట కడియం, తుమ్మల, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Post a Comment

0 Comments