తుపాకీతో బెదిరించి.. బాలికపై సామూహిక లైంగికదాడి  తుపాకీతో బెదిరించి

బాలికపై సామూహిక లైంగికదాడి

లక్నో:  రోజురోజుకు ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. ఎక్కడో ఒక చోట లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి... తుపాకీ చూపి బెదిరించి ఓ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. హమీపూర్‌ జిల్లా మజ్‌గాన్‌ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(17) వారం రోజుల కిందట చేను వద్దకు వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువఁలు.. ఆమెను తుపాకీతో బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఘటనను వీడియో తీశామని, ఎవరికైనా చెబితే సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితురాలి కుటుంబీకులు తొలుత సాహసించలేదు. కానీ, శనివారం ధైర్యం చేసి మజ్‌గాన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఒక నిందితుడిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకొనేందుకు మూడు బృందాలు గాలిస్తున్నాయఁ ఎస్పీ దినేశ్‌కుమార్‌ వెల్లడించారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం.. అత్యధిక నేరాలు ఉత్తరప్రదేశ్‌లోనే జరుగుతున్నాయి. దేశంలోని మొత్తం నేరాల్లో ఒక్క యూపీలోనే 9.5 శాతం కేసులు నమోదైనట్టు వెల్లడైంది. అటు లైంగికదాడుల కేసుల్లోనూ యూపీ రెండో స్థానంలో(4,816) ఉన్నది. మరో బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌ 4,882 కేసులతో మొదటి స్థానంలో నిలువడం గమనార్హం.

Post a Comment

0 Comments