ఎంపీని నిల‌దీసిన నిరుద్యోగి- క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘ‌ట‌న‌


ఎందుకీ మాటలు సార్‌.. మూడేండ్లలో ఇచ్చినవి మూడువేలకు  మించి లేవు. అవి కూడా ఇంజినీరింగ్‌, వ్యవసాయ శాఖలో మాత్రమే. గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4లో భర్తీ చేస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నంస‌ అని యోగి అనే నిరుద్యోగి మంగళవారం కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం
లో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ప్రసంగించారు. కోదండరామ్‌ మతిభ్రమించి 'కొలువుల కొట్లాట' కార్యక్రమం చేపట్టి అభాసుపాలవుతున్నారన్నారు. దాంతో అక్కడే ఉన్ననిరుద్యోగి యోగి ఒక్కసారిగా లేచి ఎంపీని నిలదీశాడు. ఎవరెవరికి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. గ్యాడ్యుయేట్స్‌ జీవితాలతో ఆడుకుంటున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశాడు. కంగుతిన్న ఎంపీ దాటవేసే ధోరణిలో.. 'ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగాలివ్వలేం. వ్యవసాయం చేసుకొని బతకాలిస‌ అని ఉచిత సలహా ఇచ్చారు. దాంతో సదరు నిరుద్యోగి మరింత ఆవేదనకు గురయ్యాడు.

Post a Comment

0 Comments