కామాంధుల కౌగిలిలో చిన్నారి బ‌లి...

- అత్యాచారం.. ఆపై హ‌త్య చేసిన మాన‌వ మృగాలు
- మెద‌క్ జిల్లాలో ఘ‌ట‌న‌


         అనునిత్యం ఎక్క‌డో ఒక‌చోట అత్యాచారాలు జ‌రుగుతూనే ఉన్నాయి.. కామాంధులు చిన్నారుల‌ని కూడా క‌నిక‌రించ‌కుండా వారి అత్యాచారాలు చేస్తున్నారు... తాజాగా.... మిఠాయి ఆశ చూపి తీసుకుపోయి లైంగికదాడి చేసి ఆపై అమానుషంగా చంపేశారు.. ఈ హృదయ విదారక ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలో గురువారం వెలుగులోకి వచ్చింది. తూప్రాన్‌ సీఐ లింగేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రం ఛాప్రా జిల్లా నాయాగావ్‌ గ్రామానికి చెందిన కలాం - సఖీనా దంపతులు ఉపాధి కోసం వచ్చి ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. గ్రామ శివారులోని కేబీ ఇంజినీరింగ్‌ పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి కొడుకు  అలీ, కుమార్తె కుష్బూ(6) ఉన్నారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. వారి రాష్ట్రానికే చెందిన రవి అలియాస్‌ తాహెర్‌ కూడా కలాం ఇంటి పక్కనే అద్దెకు

 ఉంటున్నాడు. అతనూ అదే పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే, బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో చిన్నారి కుష్భూను మిఠాయి తినిపిస్తానని రవి తీసుకుపోయాడు. ఎక్కడికిపోతున్నావని కుష్భూను అన్న అలీ, అతని స్నేహితుడు జిత్తు అడగ్గా, రవి అనిల్‌ మిఠాయి పెడతాడంట.. తినేసి వస్తానని వెళ్లింది. కానీ, సాయంత్రం వరకు చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి, చివరకు మనోహరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం గ్రామ శివారులో మొండికుంట గ్రామ కల్వర్టు వద్ద సిమెంట్‌ పైపులో కుష్బూ శవం కనిపించింది. పోలీసులకు సమాచారమందడంతో జిల్లా ఎస్పీ చందనా దీప్తీ, డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు, సీఐ లింగేశ్వర్‌, మనోహరాబాద్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

Post a Comment

0 Comments