కోహ్లీ ఆగే.. మోడీ పీఛే


  • మోడీకి 52శాతం.. విరాట్‌ కోహ్లీకి 61శాతం
  • ట్విట్టర్‌లో ప్రధాని కన్నా క్రికెటర్‌ దే పై చేయి 


న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో ప్రధాని మోడీ కన్నా భారత క్రికెట్‌ సారథి విరాట్‌ కోహ్లీ దూసుకుపోతున్నారు. 2017 సంవత్సరాఁకి ట్విట్టర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాని మోడీ ట్విట్టర్‌ను అనుసరించే వారి సంఖ్య 52 శాతం పెరిగి 37.5 మిలియన్లకు చేరింది. గతేడాది ఆ సంఖ్య 24.6 మిలియన్లుగా ఉండేది. ఫాలోయర్స్‌ పెరిగినా..శాతాలవారీగా చూస్తే..ప్రధాని మోడీని పరుగుల యంత్రం విరాట్‌కోహ్లీ ఫాలోయింగ్‌లో వెనక్కి నెట్టేశాడు. కోహ్లీని అనుసరించే వారి సంఖ్య ఈ ఏడాది 61 శాతం పెరిగింది. ఈ లెక్కన మోడీ కన్నా అనుసరించేవారి సంఖ్య తొమ్మిదిశాతం ఎక్కువగా           Readmore...

 పెరిగింది. గతేడాది 12.9 మిలియన్ల మంది కోహ్లీఁ అనుసరించగాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 20.8 మిలియన్లకు చేరింది. ఇక క్రికెట్‌ లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ను అనుసరించేవారి సంఖ్య 56 శాతం పెరిగింది. అత్యధికమంది అనుసరించే ట్విట్టర్‌ ఖాతాలు కలిగిన టాప్‌- 10మంది భారతీయుల్లో తొలిసారి కోహ్లీ, సచిన్‌లు స్థానం దక్కించుఁన్నారు.శాతాల వారీగా చూస్తే..మోడీ 52 శాతం, కోహ్లీ 61శాతం,సచిన్‌ 56శాతంలతో టాప్‌ పొజిషన్‌కు చేరుకోవటం విశేషం. ఇక అత్యధికమంది అనుసరిస్తున్న ట్విట్టర్‌ ఖాతాల్లో బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, అక్షయ్‌ఁమార్‌, ఆమీర్‌ఖాన్‌, దీపికా పదుకొణె, హతిక్‌ రోషన్‌లు ఉన్నారు. ముఖ్యంగా షారుఖ్‌, సల్మాన్‌లను అనుసరించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 

Post a Comment

0 Comments