ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లక్కర్లేదు....



  •  పెట్రోకార్‌ సిబ్బందికి లిఖితపూర్వకంగా ఇవ్వొచ్చు
  •  దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో అమలు
  •  హైదరాబాదీలకు సీపీ నయాసాల్‌ నజరానా....


పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే ఇకపై పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. తమ ప్రాంతానికి వచ్చే పెట్రోకార్‌ (పెట్రోలింగ్‌ మొబైల్‌) సిబ్బందికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సరిపోతుంది. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ జారీ చేస్తారు.

     హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పౌరులకు ఈ వెసులుబాటు ఉంటుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని హైదరాబాద్‌ నగరంలో అమలు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన అన్ని జోన్ల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా పౌరులు ఫిర్యాదు చేయాలంటే.. ఠాణా మెట్లెక్కాల్సిందే. ఆ సమయంలో ఫిర్యాదును స్వీకరించే రైటర్‌ గానీ, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ గానీ అందుబాటులో లేకుంటే.. వారు వచ్చేదాకా ఎదురు చూడటమో.. మళ్లీమళ్లీ పోలీ్‌సస్టేషన్‌ చుట్టూ తిరగడమో తప్పనిసరి. ఇకపై హైదరాబాదీలకు ఆ ఇబ్బందులు ఉండబోవని అంజనీకుమార్‌ తెలిపారు. 

    ‘‘ఇప్పటికే హైదరాబాద్‌ సిటీ పోలీసులకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా పెట్రోకార్‌ అధికారులను ప్రకటించాం. ఎక్కడ ఏ నేరం జరిగినా.. ముందు చేరుకునేది పెట్రోకార్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది మాత్రమే. వారి వల్లే విజిబుల్‌ పోలీసింగ్‌ పెరుగుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విస్తృతమవుతోంది. ప్రజలతో ఎక్కువ శాతం ప్రత్యక్ష సంబంధాలు ఉండేది వారికే. అందుకే.. వారికి ఫిర్యాదును స్వీకరించి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అధికారాలిచ్చాం’’ అని ఆయన వివరించారు. 

    ఈ విధానం ప్రకటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవస్థను అమల్మాట్లాడుతూ.. ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి గత నెలంతా కసరత్తు చేశామన్నారు. ‘‘ప్రతి అధికారికి.. పెట్రోలింగ్‌ సిబ్బందికి దీనిపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. కొన్ని చోట్ల ట్రయల్స్‌ చేశాం. ఆ సమయంలో లోటుపాట్లను గుర్తించాం. వైఫల్యాలను సవరించుకున్నాం’’ అని వెల్లడించారు. ఫిర్యాదుదారులు తప్పనిసరిగా తమ పేరు, మొబైల్‌ నంబరు, పూర్తి చిరునామాను పెట్రోకార్‌ సిబ్బందికి అందించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు పరిమితం కానున్న ఈ విధానం త్వరలో రాష్ట్రంలోని ఇతర పోలీసు కమిషనరేట్లు, జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments