- ముందస్తుగా వెంకన్నను దర్శించుకున్న యువ సీఎం
- అవునంటోన్న టీఆర్ఎస్ నేతలు
దేవుడంటే నమ్మకం లేదనే తెలంగాణ మంత్రి కేటీఆర్ వెంకన్నసన్నిధికి చేరాడు.. ఓ వైపు కాబోయే సీఎం కేటీఆర్ అనిపార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నరు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే కేటీఆర్కు పట్టాభిషేకం ఉంటుందని, అందుకే ముందస్తుగా తిరుమలకువెళ్లాడని కొందరు నేతలు అనుకుంటున్నారు. మంత్రులు సైతం కేటీఆర్ సీఎం అయితే నో అబ్జాక్షన్ అంటున్నారు. గతంలోనూ కేటీఆర్ సీఎం అవుతారనివార్తలు గుప్పుమన్నాయి. అయితే రెండోసారి సీఎం అయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మరో పదేండ్లు సీఎంగా నేనే ఉంటానని ప్రకటించడంతో కొద్ది రోజులు కేటీఆర్ విషయం బ్రేక్ పడింది. కేటీఆర్కు పట్టాభిషేకమా లేదా? అన్న విషయాలు తెలియాలంటే మున్సిపల్ ఎన్నికల వరకు ఆగాల్సిందే మరీ!
0 Comments