హైదరాబాద్‌లో విషాదం..

- ఓయో ఉద్యోగిని ఆత్మహత్య...

     హైదరాబాద్ లోని 
గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓయో ఉద్యోగిని మౌనిక(25) ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు.  కొండాపూర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో మౌనిక స్నేహితులతో కలిసి నివాసం ఉంటుంది. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ గ్రామానికి చెందిన మౌనిక.. 2015 నుంచి నగరంలోనే నివాసం ఉంటుంది. గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0 Comments