ఏసీబీ వలలో జీ హెచ్ఎంసీ టాక్స్ ఇన్స్పెక్టర్
    గ్రేటర్ హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సర్కిల్ 21లో టాక్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న యాదయ్య అతని పర్సనల్ అసిస్టెంట్ సాయి లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సర్కిల్ పరిధిలోని బాపు నగర్ లో ఎజాజ్ ఖాన్ 60 గజాల్లో మూడంతస్తుల ఇల్లు కట్టుకున్నాడు. టాక్స్ అసెస్మెంట్ చేయడానికి ఏడాదికి 20 వేల పైగా చెల్లించాల్సి ఉంటుందని 15 వేలు లంచం ఇస్తే తగ్గిస్తానని చెప్పి యాదయ్య డిమాండ్ చేశాడు.
       దాంతో బాధితుడు వారం క్రితం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. గురువారం 15 వేలు లంచం తీసుకుంటూ యాదయ్య అసిస్టెంట్ సాయి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలోని సెక్షన్ లో సోదాలు జరిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ అధికారులు తెలిపారు.


Post a Comment

1 Comments

  1. 60 గజాలలో మూడంతస్తుల ఇల్లు ఒకడు కడతాడు. దానికి అనుమతి ఎలా ఇచ్చారో మరి.

    అది పన్ను మదింపు చేయడానికి లంచావతారాలు సిద్ధం.

    థూ మీ బతుకులు చెడ. మీరు మారరు రా.

    ReplyDelete