ఇండియా @ 24,942         


    దేశవ్యాప్తంగా 1490 కొత్త కేసులు నమోదుకాగా, 56 మంది చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కు, మొత్తం మృతుల
సంఖ్య 779కు చేరుకుంది. గడచిన ఐదు రోజుల గణాంకాలను పరిశీలిస్తే ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా 17,656 పాజిటివ్ కేసులు ఉంటే 25వ తేదీ నాటికి అది 24,942కు చేరుకుంది.
      ఐదు రోజుల వ్యవధిలో 7,286 కొత్త కేసులు, 220 మరణాలు చోటుచేసుకున్నాయి. ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి మార్కు దాటితే ఇప్పుడు మరో రెండు రాష్ట్రాలు చేరాయి.
         తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో నాలుగు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఉన్నాయి. ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.
   ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 61 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,016కు చేరుకుంది. గుజరాత్ రాష్ట్రం సైతం మూడువేల మార్కును దాటింది. కేసుల డబ్లింగ్ సమయం పది రోజులకు పెరిగినా ఇటీవలి కాలంలో ప్రతీరోజు 1400 కంటే ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి.

Post a Comment

0 Comments