872 మంది మృతి‌

  • ‌‌భారత్​లో కరోనా కేసులు 27,892
  • కోలుకున్నవారు 6,185

       
           కరోనా నివారణకు ప్రభుత్వాలు పటిష్టంగా చర్యలు చేపడుతున్నా కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి..  గడిచిన 24గంటల్లో కొత్తగా 1,396 కేసులు నమోదవ్వగా, 48 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 27,892కు చేరగా, మృతుల సంఖ్య 872కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.
          ప్రస్తుతం 20,835 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 6,185మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించింది. అయితే, కోవిడ్ 19 బారినపడినవారి మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా 7శాతం ఉండగా, భారత్‌లో మాత్రం 3.1శాతమే ఉందని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
           అలాగే, దేశంలో ఇప్పటివరకు 283జిల్లాల్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాకపోగా, మరో 64జిల్లాల్లో వారంరోజులుగా కొత్త పాజిటివ్ కేసులేవీ వెలుగుచూడలేదని తెలిపారు.

Post a Comment

0 Comments