రంజీ మ్యాచ్​ల్లో డీఆర్​ఎస్​..


   

         ఇక నుంచి రంజీ మ్యాచ్​ల్లో సైతం  డెషిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) అమల్లోకి రానుంది. ఇప్పటివరకూ ఈ టెక్నాలజీని అంతర్జాతీయ క్రికెట్​ మ్యాచ్​ల్లో మాత్రమే వినియోగించారు. అంపైర్​ నిర్ణయం ఒకవేళ తప్పుగా ఇస్తే డీఆర్​ఎస్​లో తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీ ప్రవేశపెట్టినప్పటి నుంచి బీసీసీఐ ఉపయోగించడం లేదు. ఎందుకంటే ఈ టెక్నాలజీని వినియోగించాలంటే ఒక మ్యాచ్​కు సుమారు 45 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విధానమని మొగ్గు చూపలేదు. కానీ  దేశవాళీ క్రికెట్  రంజీల్లో మాత్రం ఈ సీజన్ ఫైనల్స్‌లోనే లిమిటెడ్ డీఆర్ఎస్ ప్రవేశపెట్టారు. ఈ ఫైనల్ మ్యాచ్‌కు అంపైరింగ్ నిర్వహించిన ఎస్. రవి, కేఎన్ అనంతపద్మనాభన్, యశ్వంత్ బర్దే భవిష్యత్‌లో లిమిటెడ్ డీఆర్ఎస్‌కు సై అంటున్నారు. భవిష్యత్‌లో ఈ టెక్నాలజీ చౌకగా లభిస్తే అప్పుడు పూర్తి స్థాయిలో వినియోగించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments