మాస్కులు లేకుండా తిరిగితే చర్యలు  • సైబరాబాద్ సీపీ సజ్జనార్....
  • మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు 


         
             కరోనా వైరస్‌ సోకినా చాలా మందికి లక్షణాలు కనబడవని, అలాంటివారు కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉందని వైరస్‌ సోకకుండా
రక్షణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమని.. బయటకు వచ్చే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్  వీసీ సజ్జనార్ తెలిపారు.
              ఇదివరకు కరోనా లక్షణాలు ఉన్నవారు, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడేవారు, రోగులకు సేవలందించే వారు మాత్రమే మాస్కులు ధరించాలనే నిబంధన ఉండేది. అయితే కొందరిలో కరోనా లక్షణాలు బయటకు కనిపించనప్పటికీ  ఫలితాల్లో కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ జరుగుతోంది. ఇలాంటి వారు మాస్కు లేకుండా బయకు వెళుతుండటంతో వారు వారికే తెలియకుండా వ్యాధి వ్యాప్తికి వాహకాలుగా  పని చేస్తున్నారు. వీరి నుంచి ఇతరులకు  వైరస్‌ సోకుతోందని ఇటీవల వైద్య, అధ్యయనంలో తేలింది. ఈ కారణంగా వైరస్‌ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం ఉండటంతో  మాస్కుల వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్నారు.
              కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని తెలంగాణా వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం (Memo No 2133/D/2020) ఆదేశాలు జారీచేసిందన్నారు. 
             

Post a Comment

0 Comments