ఏసీలు, కూలర్లు వాడితే జాగ్రత్త..

  • ఏసీలు, కూలర్ల వాడకంపై
     ఐఎస్ హెచ్ఆర్ఏఈ మార్గదర్శకాలు

        కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేటింగ్ అండ్ కండిషనర్ ఇంజినీర్స్ (ఐఎస్ హెచ్ఆర్ఏఈ) మార్గదర్శకాల ప్రకారం.. ఇండ్లలో ఏసీలు వాడేటప్పుడు 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలని, తేమస్థాయి 40 నుంచి 70 వరకు ఉంటే మంచిదని స్పష్టం చేసింది. వెంటిలేషన్ కోసం కూలర్లు బయటి గాలిని పీల్చుకునేలా ఏర్పాటు చేసుకోవాలని, కూలర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించింది.
కరోనాపై చైనాలోని వంద నగరాల్లో చేసిన అధ్యయనం ప్రకారం.. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ ఈ వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తున్నట్టు గుర్తించారు.

Post a Comment

0 Comments