మామిడి పండ్లు కావాలా.. అయితే ఫోన్​ చేయాలి మరి!

     


        లాక్​డౌన్​ కారణంగా పండ్ల మార్కెట్లు మూసివేతతో మామిడి అమ్మకాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మామిడి పండ్ల అమ్మకాలు పెంచాలనే ఆలోచనతో తెలంగాణ ఉద్యానవన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండ్లు కావాలనుకునేవారు ఫోన్​ చేస్తే ఇంటికే డోర్​ డెలివరి చేయడానికి సిద్ధమైంది. మే1 నుంచి అందుబాటులోకి రానుంది.  5 కిలోల బాక్స్‌లో సుమారు 12 నుంచి 15 పండ్లు ఉంటాయని, డెలివరీ చార్జీలతో కలిపి రూ.350 చెల్లించాలని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 7997724925, 7997724944 నెంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు.  

Post a Comment

0 Comments