రెండు రెడ్​జోన్ల ఎత్తివేత        ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్​ నియంత్రణలోకి వచ్చిందనే చెప్పొచ్చు. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు వైరస్​ను తరమికొట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్​ జోన్లను ఎత్తివేశారు. రాజమండ్రిలోని వీరభద్రాపురం, శాంతి నగర్‌లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. అయితే, గత 28 రోజులుగా ఈ పరిసరాల్లో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో రెడ్ జోన్ ఎత్తివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాజమండ్రిలో ఎనిమిది కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయి.

Post a Comment

0 Comments