రిషీకపూర్​ కన్నుమూత

  • 24 గంటల్లో ఇద్దరు నటుల్ని కోల్పోయిన బాలీవుడ్​
  • అంత్యక్రియలకు ఎవరూ హాజరుకావొద్దు: కుటుంబసభ్యులు
  • రిషీ మరణం తీరని లోటు

       
బాలీవుడ్​ సీనియర్​ నటుడు రిషికపూర్​ (67) గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా శ్వాస కోస సమస్యతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రంగా ఉండడంతో బుధవారం కుటుంబసభ్యులు ముంబైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం పరిస్థితి విషమించి రిషికపూర్​ కన్నుమూశారు. అమెరికాలో కేన్సర్​ చికిత్స తీసుకుని గతేడాది ఇండియా వచ్చారని ఆయన తనయుడు బాలీవుడ్​ నటుడు రణ్​బీర్​కపూర్​ తెలిపారు.

24 గంటల్లో ఇద్దరు నటులను కోల్పోయిన బాలీవుడ్​
       విలక్షణ నటుడు ఇర్ఫాన్​ఖాన్​ మరణం నుంచి బాలీవుడ్​ సినీ పరిశ్రమ కోలుకోకముందే మరో నటుడు రిషీకపూర్​ కోల్పోవడం బాధాకరం.  ఇది సినీ పరిశ్రమకు తీరని లోటు.

అంత్యక్రియలకు  అభిమానులు రావొద్దు: కుటుంబ సభ్యులు
        ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్​ ఉన్న విషయం తెలిసిందే. దీంతో రిషీకపూర్​ అంత్యక్రియలకు సన్నిహితులు, అభిమానులు హాజరు కావొద్దని కుటుంబసభ్యులు తెలిపారు.

Post a Comment

0 Comments