ఉపాధి కూలీలకు గుడ్​న్యూస్​


         



          ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కూలీలకు చెల్లించే దినసరి కూలి రూ.211 ఉండేది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం దినసరి కూలి రూ.237 అయ్యింది.  పెరిగిన కూలీ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి వర్తిస్తాయని ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆ జీవోలో స్పష్టంచేశారు. రాష్ట్రంలో సుమారు 55.77 జాబ్ కార్డులు ఉండగా ఇందులో 30.80 జాబ్ కార్డులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  54.82 లక్షల మంది కార్మికులు ఈ పథకం కింద ఇప్పుడు పనిచేస్తున్నారని, ఇందులో సుమారు 16.45% మంది ఎస్సీలు కాగా, 13.3% మంది ఎస్టీ కార్మికులు.  ముప్పై జిల్లాల పరిధిలో ఉన్న 8763 గ్రామ పంచాయతీల్లో ఈ కార్మికులు గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. 

Post a Comment

0 Comments