పోలీస్​ డిపార్ట్​మెంట్​కు చెడ్డపేరు తేవొద్దు


  • వ్యక్తులను కొట్టిన కానిస్టేబుల్​, హోంగార్డుల తీరు సరికాదు
  • డీసీపీలు జోన్లలో రెండు పోలీస్​స్టేషన్లు సందర్శించాలి
  • హైదరాబాద్ సీపీ అంజనీకుమార్​


    పోలీస్​ డిపార్ట్​మెంట్​కు చెడ్డపేరు తీసుకురావద్దని సిబ్బందికి హైదరాబాద్​ పోలీస్ కమిషనర్​ అంజనీకుమార్​ సూచించారు. హైదరాబాద్ మీర్ చౌక్ పీఎస్ పరిధిలో కొందరు వ్యక్తులను ఓ కానిస్టేబుల్, గోల్కొండ పరిధిలో ఓ హోంగార్డు లాఠీలతో కొట్టారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వారిపై అసహనం వ్యక్తం చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతూ పోలీసుల విధులకు ఆటంకం కలిగించొద్దని చెప్పారు.  ఏసీపీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు  సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని సూచిం చారు. ప్రతి డీసీపీ ప్రతి రోజు తన జోన్ లో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లను సందర్శించాలని అన్నారు. 

Post a Comment

0 Comments