రైల్లో ప్రయాణం చేయాలంటే.. నిబంధనలు  • ‌‌ప్రయాణానికి కనీసం 2గంటల ముందే స్టేషన్​లో ఉండాలి
  • మాస్క్​లు తప్పనిసరి
  • టికెట్​ కౌంటర్​ వద్ద భౌతికదూరం పాటించాల్సిందే..            కరోనా వైరస్​ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మే3 వరకూ దేశవ్యాప్త లాక్​డౌన్​ ప్రకటించిన విషయం తెలిసిందే... మే3 తరువాత లాక్​డౌన్​ ఎత్తివేసినట్లైతే.. రైలు ప్రయాణంలో కొన్ని నిబంధనలు తీసుకువచ్చారు రైల్వే అధికారులు. ఇప్పటికే పలు   రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలోనూ ఇదే తరహా మాక్ డ్రిల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించారు.
         రైలు ఎక్కాలంటే, ఎయిర్ పోర్టుకు వెళ్లినట్టుగా కనీసం 2 గంటల ముందే స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. రైలు ప్రయాణం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. ఆపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్యమూ లేదని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. 
        మనతో పాటు ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా మన వంతు బాధ్యత కూడా తీసుకోవటం మంచిది. రైల్వే టికెటింగ్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవాలన్నా భౌతికదూరం పాటించడం తప్పనిసరి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జనరల్ బోగీ ప్రయాణీకులను ఎలా నియంత్రిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. రైల్వే స్టేషన్లలో ధర్మల్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.  

Post a Comment

0 Comments