బాలికపై సామూహిక అత్యాచారం

వివరాలు వెల్లడిస్తున్న వనపర్తి ఎస్పీ అపూర్వరావు

  • నిందితులు అరెస్టు
  • నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
  • ఎస్పీ అపూర్వ వెల్లడి
  • తెలంగాణలోని నాగర్​కర్నూల్​ జిల్లాలో ఘటన

             ఓ బాలికపై సామూహికంగా అత్యాచారం చేసిన అనంతరం పురుగుల మందు తాగించి హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్​కు తరలించారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావు తెలిపిన వివరాల ప్రకారం  నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన ఓ బాలిక, సాయికృష్ణ మధ్య కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ నెల 27న  బాలికను సాయికృష్ణ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లాడు. ముందస్తు పథకం ప్రకారం తన స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. విషయం బయటకు తెలిస్తే ప్రమాదం అని భావించిన ఆ ఇద్దరు పురుగుల మందు తాగించి బాలికను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వదిలించుకునే క్రమంలో వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి పరారయ్యారు. ప్రధాన నిందితుడు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. ఇద్దరు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అపూర్వ తెలిపారు.

Post a Comment

0 Comments