17 వరకూ లాక్​డౌన్​

Photo by Victor He on Unsplash

  • మరో రెండు వారాలు పొడిగింపు
  • కేంద్రం కీలక నిర్ణయం
  • ఎంహెచ్​ఏ ఉత్తర్వులు జారీ


   కరోనా నివారణ నేపథ్యంలో ఈ నెల3 వరకూ దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమల్లో ఉంది. పూర్తి స్థాయిలో కరోనాను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాల పాటు లాక్​డౌన్​ పొడగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర హోం వ్యవహారాల శాఖ (ఎంహెచ్​ఏ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4 నుంచి 14 రోజుల పాటు లాక్​డౌన్​ అమల్లో ఉండనుందని పేర్కొంది.  కరోనా కేసుల ఉద్ధృతి ఆధారంగా హాట్‌స్పాట్‌లు, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లుగా ఏరియాలను విభజించి ఆంక్షలను అమలు చేయనున్నట్టు ఎంహెచ్ఏ పేర్కొంది. ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో పలు కార్యకలాపాలకు మినహాయింపులుంటాయని వివరించింది.  ఈ రెండు వారాల వ్యవధి కాలంలోనూ విమానం, రైళ్లు, మెట్రో సేవలపై నిషేధాజ్ఞలు ఎప్పట్లాగే అమలు కానున్నాయి. అలాగే, రాష్ట్రాల మధ్య రవాణాపైనా ఆంక్షలు కొనసాగుతాయి. వీటితోపాటు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్య, శిక్షణ సంస్థలు, హోటల్స్, రెస్టారెంట్లు, సినిమా హాల్స్, జిమ్స్, మాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటి అత్యధిక మంది గుమిగూడే ప్రాంతాలపై నిషేధముంటుంది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సదస్సులపైనా ఆంక్షలు కొనసాగుతాయి.   

Post a Comment

0 Comments