కరోనా కట్టడికి రూ.35 లక్షల విరాళం


  • తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సాయం
  • సీఎం కె. చంద్రశేఖర్​రావుకు చెక్​ అందజేత

కరోనా కట్టడికి రూ.35 లక్షల విరాళం
సీఎం చంద్రశేఖర్​రావుకు చెక్కును అందజేస్తున్న సభ్యులు

కరోనా వైరస్​ నియంత్రణకు తమ వంతు సాయంతో ఎంతో మంది విరాళాలు అందజేస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ కాటన్​ మిల్లర్స్​ అండ్​ ట్రేడర్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ ముందుకు వచ్చింది. ప్రగతి భవన్​లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్​రావును అసోసియేషన్​ సభ్యులు కలిశారు. అనంతరం  సీఎం సహాయనిధికి రూ.35 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్​ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్​రెడ్డి, జనరల్​ సెక్రటరీ కక్కిరాల రమేశ్​, సభ్యులు పాల్గొన్నారు.