ఫ్యామిలీకి 7వేల రూపాయలు


  • 20 కిలోల బియ్యం పంపిణీ చేయాలి
  • కేంద్రం 10లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజి ప్రకటించాలి
  • సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

       దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ నేపథ్యంలో నిరుపేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక్కో కుటుంబానికి రూ.7వేలతో పాటు 20 కిలోల బియ్యాన్ని అందజేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ డిమాండ్​ చేశారు. ప్రజలను, వలస కార్మికులను ఆదుకోవాలని, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని సీపీఐ జాతీయ సమితి దేశవ్యాప్త పిలుపు మేరకు హైదరాబాద్​లోని మగ్దూంభవన్‌లో పార్టీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు సోమవారం ఒకరోజు ఉపవాస దీక్ష  చేపట్టారు.
      ఈ సందర్శంగా నారాయణ మాట్లాడుతూ.. కేంద్రం రూ.10లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి  రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలన్నారు. గ్రీన్ జోన్లలో మద్యం షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నమన్నారు. ఎండను లెక్క చేయకుండా స్వస్థలాలకు కాలి బాటన వెళ్తుంటే లాఠీఛార్జ్ చేస్తారా అని ప్రభుత్వంపై  చాడ మండిపడ్డారు. దీక్షకు టీడీపీ , టీజేఎస్​లు సంఘీభావాన్ని ప్రకటించాయి. టీజెఎస్ చీఫ్​ కోదండరాం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సీపీఐ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.