70 లీటర్ల నాటు సారా స్వాధీనం

70 లీటర్ల నాటు సారా స్వాధీనం Warangal Dist
పోలీసుల అదుపులో నాటు సారాను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు


  • తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
  • కేసు నమోదు చేసిన పర్వతగిరి పోలీసులు

   గుట్టు చప్పుడు కాకుండా నాటుసారాను తరలించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్​ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పర్వతగిరి సీఐ కిషన్​ తెలిపిన వివరాల మేరకు వరంగల్​ జిల్లా నెక్కొండ మండలం నుంచి అక్రమంగా వరంగల్​కు తరలిస్తున్నారనే సమాచారం మేరకు నిఘా పెట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి 70 లీటర్లల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కిషన్​ తెలిపారు. నాటు సారా తయారు చేసిన, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.